Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్షుల గుర్తింపు, గణన
నవతెలంగాణ-జన్నారం
జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని కవ్వాల్టైగర్జోన్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో బర్డ్వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందనపల్లి రేంజ్లోని మైసమ్మకుంట వద్ద పక్షుల లెక్కింపు చేపట్టారు. అటవీ శాఖ సిబ్బందికి పక్షుల గుర్తింపు, వాటి ప్రవర్తన, ఆవాసం ఉండే పరిస్థితులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బైనాక్యులర్ ద్వారా పకులను వీక్షిస్తూ వాటి పేర్లను గుర్తించారు. దాదాపు 40కి పైగా పక్షి జాతులను గుర్తించారు. నమోదు చేయబడిన కొన్ని పక్షి జాతులు, గ్రే హేడేడ్ ఫిప్ ఈగల్, కింగ్ ఫిషర్, రామచిలుకలు, దార్తర్, కామన్ మైనా, పైడ్ మైనా, బార్న్ స్వాల్, పొండ్ హెరాన్, ఓపెన్ బిల్ నమోదు చేసినట్టు జన్నారం ఎఫ్డీఓ మాధవరావు, ఎఫ్ఆర్ఓ ఆఫీస్ ఉద్దీన్, రత్నాకర్ రావు పాల్గొన్నారు.