Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు మంత్రుల అభినందన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మెన్‌గా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి బాధ్యతలను స్వీకరించారు. హైదరా బాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఉదయం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
దీనికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ సి. మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాలు పలువురు సీనియర్ నాయకులు, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు ప్రముఖులు తరలివచ్చారు.
వేణుగోపాలచారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా వేణుగోపాలచారి సొంత జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అనేక మంది నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేణుగోపాల చారిని శాలువాలతో సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ ఎండీ విద్యాసాగర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.