Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో 12 ఏళ్ల క్రితం జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ ఘటనలో ఆజాద్, జర్నలిస్ట్ హేమచందర్ పాండేల కేసుకు సంబంధించి ఆ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేసి.. విచారణ పూర్తి చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన కేసులో హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. డిసెంబర్ 13న జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై జస్టిస్ నాగార్జున స్టే విధించారు. కేసుతో సంబంధమున్న 29 మంది పోలీసులు మున్సిఫ్ కోర్టులో విచారణకు హాజరు కావాలని జిల్లా జడ్జి ఆదేశించారు. విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.