Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు
- డ్రైవర్ మృతి.. 45 మంది యాత్రికులు క్షేమం
నవతెలంగాణ-వెంకటాపురం
మాలధారణ ముగించుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న యాత్రికులు ప్రయాణం చేస్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో సీట్లోనే కుప్పకూలాడు. దాంతో బస్సు అదుపతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. అయితే, యాత్రికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 45మంది యాత్రికులు ఓంశక్తీ మాల ధరించారు. దీక్ష అనంతరం కార్తీక్ ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు బస్సులో తమిళనాడు రాష్ట్రంలోని మెల్ మాలక్తూర్లోని అమ్మవారిని దర్శించుకున్నారు. దీక్ష విరమణ అనంతరం తీర్థ యాత్రలకు బయలుదేరారు. భద్రాచలం రాముల వారిని దర్శించుకున్నారు. వెంకటాపురం మండలం మీదుగా శ్రీశైలం వెళ్తుండగా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం సమీపంలో డ్రైవర్ బాబు(50)కు గుండెపోటు వచ్చి సీట్లోనే కుప్పకూలాడు. దాంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకువెళ్ళింది. చెట్లను ఢకొీని ఆగిపోయింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 45మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. సంఘటనా స్థలికి ఎస్ఐ సురేష్ చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.