Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కర్నాటక రాష్ట్ర పర్యటనలో భాగంగా దక్షిణ కన్నడ ప్రధాన కేంద్రం మంగళూరులో గీతవృత్తి పునరుద్ధరణ కోసం స్వామి ప్రణవానంద చేపట్టిన మహాపాదయాత్రను శుక్రవారం మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. కర్ణాటకలో గీత వృత్తిని పునరుద్ధరించేందుకు తెలంగాణ గౌడ సంఘాలు.. కర్ణాటక ఈడిగ, గౌడ కులస్తులకు మద్దతుగా పోరాటం చేస్తారని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రణవానంద శ్రీ నారాయణ గురు పీఠా ధిపతి. జనార్ధన పూజారి మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ నటులు సుమన్ తల్వార్, నితిన్ గుత్తేదార్, బాలరాజ్ గుత్తేదారు, పల్లె లక్ష్మణరావు గౌడ్ , బాలగోని బాలరాజ్ గౌడ్, రామారావు గౌడ్ , వేములయ్య గౌడ్ పాల్గొన్నారు.