Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మల్లిఖార్జున్‌పై మతోన్మాదం ముసుగులో వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం ఆఫీసు బేరర్ల సమావేశాన్ని నిర్వహిం చారు. అనంతరం డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. గురువుతో మతోన్మాద శక్తులు క్షమాపణలు చెప్పించడం సమాజమంతా తలదించుకోవాల్సిన పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలా జరగడం సిగ్గుచేటని విమర్శించారు. భారతదేశ చరిత్రను మతోన్మాదం వైపు మళ్లిస్తున్న ఆర్ఎస్ఎస్ శక్తుల ఆటలకు రాష్ట్రంలో యువజనులు, మేధావులు, ప్రగతిశీల శక్తులు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఈ సంఘటన ఒక్క ఉపాధ్యాయ రంగానికే కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. దీన్ని అరికట్టడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిని వేధించిన మతోన్మాద శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అరాచక శక్తులను శిక్షించాలి : పీడీఎస్‌యూ
ఉపాధ్యాయునిపై దాడిచేసిన అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ, కార్యదర్శి నామాల ఆజాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మతం ముసుగులో చెలరేగిపోతున్న అరా చక శక్తులను ప్రభుత్వం అణచివేయాలని కోరారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యా యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కృషిచేయాలన్నారు.