Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో సత్వర న్యాయమనే కల సాద్యమనీ, సంచలన కేసుల్లో తక్షణ న్యాయం సాకారమవుతున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు, క్రూరమైన హత్యలు తదితర కేసుల్లో దోషులు తప్పించుకునే వీలు లేకుండా కఠిన శిక్ష వేసేందుకు వీలు ంటుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సారథ్యంలో ''మహిళలకు న్యాయం అందించడంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పాత్ర'' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్లోని రాజ బహదూర్ వెంకటరామరెడ్డి కళాశాలలో సెమినార్ నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఒక వ్యక్తి ఏ మతానికి చెంది న వారైనా, న్యాయం జరుగుతుందని భావించే ప్రదే శం కోర్టు అని వివరించారు. బాలల స్నేహ పూర్వక ఎజెండా దిశగా రాష్ట్రం ముందుకెళ్తున్నదని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా పేద ప్రజ లు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాస్యులు, ఆర్థికంగా వెనకబడిన వారు ఉచితంగా న్యాయ సేవలు పొం దొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పార దర్శకమైన, ఖచ్చితమైన, సత్వర న్యాయాన్ని అందించేందుకు న్యాయశాఖ నిబద్ధతతో పని చేస్తున్నదని వివరిం చారు. సైబర్ నేరాలు పెరుగు తుండడంతో స్మార్ట్ ఫోన్ ద్వారా తమ వ్యక్తిగత డిటైల్స్ ఇతరులతో పంచు కోవద్దని విద్యార్థులకు సూచించారు. మ్యారేజీ యాక్టు ప్రకారం ప్రతి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించు కోవాలనీ, గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు ఆయా రిజిస్ట్రేషన్లపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలకు ఏ సమస్య వున్న ధైర్యంగా ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమి షన్ అండ గా ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్ర మహిళా కమి షన్ కార్యదర్శి కష్ణ కుమారి, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి మురళి మోహన్, మహిళా కమిషన్ సభ్యులు షాహిన్ ఆఫ్రోజ్, కటారి రేవతి రావు, ఆర్బీవీఆర్ఆర్ ప్రిన్సిపల్ అచ్యుత దేవి,రిసోర్స్ పర్సన్ రాజేశ్వరి సెమినార్లో పాల్గొన్నారు.