Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ని ప్రాజెక్టులు కట్టారో శ్వేతపత్రం విడుదల చేయండి : ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 111 జీవో ముసుగులో భూముల వ్యాపారం నడుస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. దమ్ముంటే రాష్ట్రంలో ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టారనే విషయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైెతులతో పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. గ్రామసభ నిర్వహించి మాస్టర్‌ప్లాన్‌పై అభిప్రాయం తీసుకుంటే బాగుండేదన్నారు. రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఏప్రిల్‌లో చార్జిషీట్ విడుదల చేస్తారని చెప్పారు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలోపేతమ య్యేందుకు 10 వేల గ్రామాల్లో గ్రామసభలు పెడతామని తెలిపారు. మిషన్-90తో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై మేధావులు స్పందించాలన్నారు. సంక్రాంతి తర్వాత మేధావులతో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.