Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతిపై పలు అనుమానాలు
నవతెలంగాణ-నవీపేట్
గోదావరి నదిలో దూకి ఇరిగేషన్ డీఈఈ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ గోదావరి వద్ద శుక్రవారం వెలుగు లోకి వచ్చింది. ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన రమణా రావు (46) జలవనరుల శాఖ డీఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా వ్యక్తిగత కారణాలతో గత ఫిబ్రవరి నెల నుంచి సెలవులపై ఉన్న ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. బుధవారం కారులో స్వగ్రామం పోతంగల్‌కు వచ్చాడు. తిరిగి మోటార్ బైక్‌పై ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. హైదరాబాద్‌కు చేరుకోకపోవడంతో బంధువులకు ఫోన్ చేసినా సమాచారం తెలియలేదు. దాంతో మృతుని అన్న మధుకర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యంచ గోదావరికి వద్ద మోటార్ బైక్ కనిపించడంతో గజ ఈతగాళ్లతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం ఉదయం మృతదేహం లభించింది. స్వగ్రామం పోతంగల్లో అంత్యక్రియలు జరపగా జడ్పీ చైర్మెన్ దాదన్నగారి విఠల్‌రావు, రామ్ కిషన్‌రావు, అనిల్‌రావు హాజరయ్యారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.