Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీచైతన్య హ్యాట్రిక్ ప్రపంచ రికార్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వంద నిమిషాల్లో వంద మ్యాథ్స్ గుణింతాలతో శ్రీచైతన్య స్కూల్ హాట్రిక్ ప్రపంచ రికార్డును సాధించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ శ్రీవాత్సవ నుంచి శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ శుక్రవారం సర్టిఫికెట్‌ను అందుకున్నారు. వంద రోజుల శిక్షణతో పది రాష్ట్రాల్లోని 73 బ్రాంచీల నుంచి 400 జూమ్ లింక్‌ల ద్వారా రెండువేలకుపైగా ప్రాథమిక, ప్రీప్రైమరీ విద్యార్థులు పాల్గొని ఒకటి నుంచి వంద వరకు మ్యాథ్స్ గుణింతాలను వంద నిమిషాల్లో చెప్పారని ఆమె వివరించారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచిందనీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించారని తెలిపారు. విద్యార్థులు, టీచర్లు ఒక్కటై ఎంతో ఇష్టంతో కృషిచేయడం వల్లే ఇంత గొప్ప విజయం, వరల్డ్ రికార్డు సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ రికార్డు సృష్టించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరంతరం కృషిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు అభినందనలు తెలిపారు.