Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాకు రూ.80,100
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గురువారం దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు ధర పలికింది. గతంలో ఎప్పుడు లేని విధంగా క్వింటాకు ధర రూ 80,100 పలికింది. మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు కొత్త మిర్చికి ఈధర పలకడం ఇదే మొదటిసారి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావి చెట్టు తండాకు చెందిన తేజవత్ రాములు అనే రైతు శుక్రవారం 4 బస్తాలు కొత్తరకం దేశీ మిర్చిని తీసుకురాగా అన్నపూర్ణ ట్రేడర్స్ ఆర్తి ద్వారా శ్రీ చైత్ర ఎంటర్ప్రైజెస్ ఖరీదుదారు అత్యధిక ధర రూ.80,100 పెట్టి కొనుగోలు చేశారు. శుక్రవారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు తేజ రకం మిర్చి 1755 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.20,000 పలుకగా కనిష్ట ధర రూ.16,000, వండర్ హాట్ 48 బస్తాలు రాగా ధర రూ.37,000 కనిష్ట ధర రూ.31,000, యుఎస్ 341 265 బస్తాలు రాగా ధర రూ.26,000, కనిష్ట ధర రూ.20,000, తాలు 267 బస్తాలు రాగా ధర రూ.10 వేలు పలుకుగా కనిష్ట ధర రూ.5000 పలికింది.