Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికక్కడ రైతుల అరెస్టులు
- మద్దతు తెలిపిన సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బంద్‌కు పిలుపునివ్వగా.. బంద్ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్లపైకి వచ్చిన రైతులను పోలీసులకు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా బంద్‌కు సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీతో పాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఇక వ్యాపారస్తులు, కిరాణా షాప్ యాజమానులు బంద్‌లో భాగంగా తమ వ్యాపార, దుకాణ సముదాయాలను స్వచ్ఛంధంగా మూసి ఉంచారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, మాస్టర్ ప్లాన్ రద్దు చేసేంతవరకు తమ పోరాటాన్ని ఆపబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేవరకూ తమ పోరాటాన్ని రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, బంద్‌లో భాగంగా రైతులకు మద్దతు తెలిపిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్‌గౌడ్, నాయకులు అరుణ్‌కుమార్, నర్సింలును, కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.