Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగం లోని యూకో బ్యాంక్ శుక్రవారం దేశ వ్యాప్తంగా తన 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించు కుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జోన్ లో బోడుప్పల్, జగిత్యాల్లో రెండు కొత్త శాఖలను ఏర్పాటు చేసింది. వీటిని ఆ బ్యాంక్ హైదరాబాద్ జోనల్ మేనేజర్ సందీప్ శర్మ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో ఎజిఎంలు మోతిలాల్, శశి భూషన్ రావు, లోకేంద్ర శర్మలు పాల్గొ న్నారు. బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా అభి సాయి దత్తా ట్రస్ట్ అనాథ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించి.. నిత్యవసర సరుకులను అందజే శారు. బంజారా హిల్స్ జోనల్ ఆఫీసులో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు.