Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి సబిత
- ప్రారంభోపన్యాసం చేయనున్న కేరళ మాజీ మంత్రి శైలజా టీచర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ఐదో మహా సభలు ఈనెల 13,14 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సాగర్ రోడ్ మన్నెగూడలో బీఎంఆర్ సార్థా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో కలిసి శుక్రవారం ఆవిష్క రించారు. మహాసభల సందర్భంగా ఈనెల 13న తొలిరోజు ఉపాధ్యాయుల మహాప్రదర్శన, బహిరంగ సభను నిర్వహిస్తారు. ముఖ్యఅతిధిగా సబితా ఇంద్రారెడ్డి హాజరవుతున్నారు. కేరళ మాజీ మంత్రి కెకె శైలజా టీచర్ ప్రారంభోపన్యాసం చేస్తారు. అతిధులుగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామ య్య, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆహ్వానసంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజ రవుతారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులందరూ సహకరించాలని కోరారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నా మన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టీఎస్‌యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తున్నదని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి మాట్లాడుతూ విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణకు దోహదం చేస్తున్న జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల కుటుం బాలకు శాపంగా మారిన సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా నిరంతరం కార్యాచరణ చేస్తున్నదని వివరించారు. ఈ మహాసభల్లో నిర్దిష్ట పోరాట కార్యక్రమాలను రూపొందించు కుంటామన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ అభ్యర్థి పి మాణిక్ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ గాలయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె గోపాల్ నాయక్, ఎం వెంకటప్ప, నాయకులు కల్పన, జగన్నాథ్, గణేష్ పాల్గొన్నారు.