Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి విద్యార్థులకు ఆదివారం, రెండో శనివారం ప్రత్యేక పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి కాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆదివారం, రెండో శనివారం ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలంటూ పాఠశాల హెడ్మాస్టర్లు (హెచ్ఎం)పై ఒత్తిడి చేయొద్దని కోరారు. పాఠశాల పనిదినాల్లోనే ఆ పరీక్షలను నిర్వహించాలని డీఈవోలను ఆదేశించారు.