Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సైదాబాద్‌లోని లోకాయుక్త బస్తీలో 50 ఏండ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారి నివాసాలను కూల్చేయడం దుర్మార్గమనీ, ఆ బస్తీవాసుల పోరాటానికి తాము అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రకటించారు.శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో లోకాయుక్త బస్తీవాసులు బండిని కలిశారు. 50 ఏండ్లుగా అక్కడే ఉంటున్నామనీ, కరెంటు బిల్లులు కడుతున్నామని చెప్పారు. రాత్రికి రాత్రే తమ గుడిసెలను కూల్చేయడం వల్ల తమ రేషన్, ఆధార్‌కార్డులు, పిల్లల సర్టిఫికెట్లను, సామాగ్రిని కోల్పోవాల్సి వచ్చిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసి అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బాధితుల పక్షాన న్యాయపోరాటం చేస్తామన్నారు.