Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ పోస్టుల్ని నేరుగా భర్తీ చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను ఆ పోస్టుల్లో భర్తీ చేసేలా ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. నాన్ టీచింగ్ వాళ్లను టీచింగ్ పోస్టుల్లో భర్తీ చేయడాన్ని ఆపాలంది. వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ నీలిమ, ఇతరులు వేసిన పిటిషన్లల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాన్ టీచింగ్ కేడర్ ఉద్యోగులను టీచింగ్‌లో భర్తీ చేయడాన్ని తప్పుపట్టింది.