Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీ భారత్ జోడో మాత్ర స్ఫూర్తితో ఈనెల 26న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రెండు నెలలపాటు అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రసంగా లను, బీజేపీ, టీిఆర్‌ఎస్ ప్రభుత్వాలపై చార్జిషీట్లను ప్రజలకు అందిం చాలని కోరారు. ఈనెల 9న సర్పంచులసమస్యలపై ధర్నా నిర్వహిస్తా మనీ, కార్యకర్తలు కదిలి రావాలన్నారు. జూమ్ సమావేశంలో ఉపాధ్యక్షు లు మల్లు రవి, చామల కిరణ్ రెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు.
కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా పొన్నం, హర్కర
రాబోయే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడు దల చేశారు. హావేరి పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను, కోలార్ ఎస్సీ పార్లమెంట్ నియోజక వర్గానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్‌ను పరిశీలకులుగా నియమించారు.