Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ తెచ్చిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు, రాష్ట్ర చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రైతులు చేసిన ఉద్యమంలో బీజేపీ హంగామా చేసిందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు విలేకర్లతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో రైతాంగం పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారని గుర్తు చేశారు. పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ రైతులు తమ నిరసనను కొనసాగించారని చెప్పారు. తక్కువ ధరకు భూమి సేకరించి, ఆ తర్వాత వ్యాపారవేత్తలకు కట్టబెట్టేందుకు మాస్టర్ ప్లాన్ చేశారని వమిర్శించారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక కామారెడ్డికి పెడితే, వేల ఎకరాల సాగు జరుగుతుందన్నారు. గ్రామాల్లో పర్యటించి, రైతులకు భరోసా కల్పిస్తామన్నారు.