Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భూసేకరణలో పట్టా భూములతోపాటు అసైన్డ్ రైతులకు సమానంగా పరిహారం ఇవ్వాల్సిందేనని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది. నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం రిజ ర్వాయర్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం సేకరించిన భూముల్లో పట్టాదారులు, అసైనీలు ఉన్నారు. పట్టాదారులతో సమానంగా అసైనీలకు కూడా పరి హారం ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును జిల్లా కలెక్టర్ సవాల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పట్టాదారు రైతులతో సమానంగానే అసైన్డు భూముల రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ తీర్పు చెప్పింది.