Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మధ్యాహ్న భోజనం వంట రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెరిగిన రేట్లు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పెంచిన రేట్లను రాష్ట్రం 60 శాతం, కేంద్రం 40 నిష్పత్తి ప్రకారం నిధులు భర్తిస్తాయి. అయితే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్న భోజన పథకంలో వంట రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి రూ.4.97 చెల్లిస్తుండగా, దాన్ని రూ.5.45పైసలకు పెంచింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి ఇప్పటి వరకు రూ.7.45 ఇస్తుండగా, దాన్ని రూ.8.17కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇది కోడిగుడ్డు ధరతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చెల్లిస్తాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఇస్తున్న రూ.9.95ని రూ.10.67 పైసలకు పెంచింది.