Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని తెలిపారు. మోడీకి కేసీఆర్‌కు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ ఎంపీలు బలరాంనాయక్, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌శెట్కర్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గారడీ మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ వ్యభిచార కేంద్రంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ముందుకు తెచ్చారని విమర్శించారు. ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ముగ్గురు హస్తం గుర్తుపై గెలిచిన వారేనన్నారు. ఏదో తానే పట్టుకున్నట్టుగా కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారినప్పుడు స్పీకర్ ఫార్మట్ రాజీనామా సమర్పిం చారని గుర్తు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డిని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరా యింపులపై సీబీఐ విచారణ జరపించాలని కోరారు. ఇదే అంశంపై త్వర లో సీఎస్, గవర్నర్, డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వివరించారు.