Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు రుణాన్ని దారి మళ్లించారని ఆరోపణలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్లలో బ్యాంకు రుణాన్ని తీసుకొని ఆ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలపై పాతబస్తీలోని ఒక యమహా షోరూమ్ యజమాని కార్యాలయంలో శనివారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాన్ అనే మోటారు వాహనాల డీలరు ఒకరు ప్రభుత్వ బ్యాంకు నుంచి గతంలో భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఆ రుణాన్ని చంద్రాయణగుట్టలో యమహా షోరూమ్ తెరవడానికని తీసుకున్నారు. అనంతరం ఆ షోరూమ్‌ను కొద్ది రోజుల తర్వాత మూసివేశారు. ఆ రుణాన్ని బ్యాంకుకు ఇచ్చిన మాట ప్రకారం కాకుండా ఇతర పనులను నిధులను మళ్లించారనీ, అంతేగాక దాని బకాయిలు కూడా చెల్లించలేదని బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు ఖాన్‌కు చెందిన యమహా షోరూమ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యాపారి పాతబస్తీకి చెందిన ప్రముఖ మహిళా డాక్టర్ భర్త అని తెలుస్తున్నది. ఈ కేసు దర్యాప్తులో ఉన్నట్టు సీబీఐ అధికారులు చెప్పారు.