Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తున్న నలుగురు నిందితులను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎల్ బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ మీడియాకు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన చొప్పర లక్ష్మీ గణేష్, మేడ ప్రదీప్, విజయవాడకు చెందిన బాలం సతీష్, చవల దుర్గా ప్రసాద్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు. ముందుగా వారు ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసి ఆమె ద్వారా ఇతర విద్యార్థినుల ఫోన్ నెంబర్లు సేకరించారు. అనంతరం సామాజిక మాధ్య మాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి అమ్మాయిలను వేధి స్తున్నారు. కాలేజీ విద్యార్థినులు, యాజమాన్యం ఫిర్యా దుతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కళాశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామని సీపీ చెప్పారు.ఆన్ లైన్ చాటింగ్‌పై యువతులు, మహిళలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. మల్కాజిగిరి డీసీపీ రక్షి తామూర్తి, ఏసీపీ నర్సింహ రెడ్డి, ఘట్కేసర్ ఇన్స్పెక్ట ర్ అశోక్ రెడ్డి, ఎస్ఐలు సుధాకర్, శివ కృష్ణ మూర్తి, దనుజారు, రాము, నాగార్జున రెడ్డి ఉన్నారు.