Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై దాడి అమానుషం :ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మల్లికార్జున్‌పై దాడి చేసిన బీజేపీ, వీహెచ్‌పీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని విద్యాపరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయుడి విధులకు ఆటంకం కల్పించిన ఘటనకు బీజేపీ రాష్ట్ర శాఖ బాధ్యత వహించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ వినాయక చవితికి చందా అడిగితే ఇవ్వలేదనే దురుద్దేశంతోనే సంఫ్‌ుపరివార్ శక్తులు ఉద్దేశపూర్వకంగా మల్లికార్జున్‌పై దాడి చేశాయని తెలిపారు. అన్యమత ప్రచారం చేస్తున్నాడనీ, దేవుళ్లను కించపరు స్తున్నాడనే నెపంతో అవమాన కరంగా హింసించారన్నారు. ప్రొఫెసర్ చక్రధర్ రావు మాట్లాడుతూ చట్టా న్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేంటని ప్రశ్నిం చారు.పీఓడబ్ల్యు అధ్యక్షులు జి ఝాన్సీ మాట్లాడుతూ ఇలాంటి అమానవీయ ఘటనలను ప్రభుత్వం పునరావృతం కాకుండా చూడాలనీ, లేదంటే..ఆ పని ప్రజాసంఘాలే చేపడతాయని తెలిపారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమన్న మాట్లాడుతూ ఉపాధ్యాయ హక్కుల ను హరించే విధంగా మతోన్మాద మూకలు వ్యవహరించడం చట్ట విరుద్ధమని తెలిపారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, శ్రీకాంత్, ప్రగశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయి రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు శంకర్, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు యాదగిరి, నాస్తిక సంఘం నాయకులు జీడి సారయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం శ్యామ్, జన్నారాపు రాజేశ్వర్, హైదరబాద్ జిల్లా కార్యదర్శి శ్రీను, ఉపాధ్యక్షుడు రాకేష్ పులి కల్పన జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.