Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి చలితీవ్రత బాగా పెరుగుతున్నది. రాష్ట్రం మీదుగా ఈశాన్యం దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు నుంచి పది డిగ్రీల మేరకే నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్లానింగ్,డెవలప్మెంట్ సొసైటీ నివేదిక పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. సోమ, ఆదివారాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, రంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నారాయణపేట, మహబూబాబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, తదితర జిల్లాల్లో పలుచోట్ల పది డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సిర్పూర్(కొమ్రంభీం అసిఫాబాద్) జిల్లాలో అత్యల్పంగా 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.