Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకుల రాస్తారోకో
నవతెలంగాణ- మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రం లో రోడ్ల దుస్థితిపై ప్రజా ప్రతి నిధులకు, అదికారులకు పంట్టిం పులేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి విమర్శిం చారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జితోపాటు బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై రాస్తారోకో చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సంకె రవి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి, బైపాస్, ఇస్లాంపూర్ ప్రాంతాల్లో రోడ్లన్నీ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఆర్ అండ్ బీ శాఖ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు వీధి పాలవుతున్నాయని తెలిపారు. దుమ్ము ధూళి వ్యాపించడంతో సమీప ఇండ్ల జనాల పరిస్థితి దయనీయంగా మారిందని, రోడ్ల దుస్థితిపై ఇప్పటికైనా స్పందించకుంటే పట్టణ దిగ్బంధ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌ను కలిసి రోడ్ల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, నాయకులు గోమసా ప్రకాష్, దాసరి రాజేశ్వరి, కనికరం అశోక్, దూలం శ్రీనివాస్, గుమసా అశోక్, దాగం రాజారం, జిల్లా కమిటీ సభ్యులు అబ్బజు రమణ, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.