Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రుణదాతలు, రుణ గ్రహీతల నడుమ అంతరాలను పూరించే సుప్రసిద్ధ ఫిన్టెక్ ఎడ్వైజర్ లోన్స్ ప్యారడైజ్ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం శనివారం హైదరాబాద్లోని లియోనియాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫిన్ఫ్రీ ఎంటర్ ప్రైజెస్ కో-ఫౌండర్ ఇర్షాద్ మెహమ్మద్, బినోద్కుమార్ సాహూ మాట్లాడుతూ..తమ సంస్థ వినియోగదారులు అత్యుత్తమ ఆర్థిక నిర్ణయాలను తీసుకునేలా మార్గనిర్ధేశనం చేస్తుందని తెలిపారు. సరసమైన వడ్డీరేట్లు, నియమ నిబంధనలకు లోబడి తక్షణమే రుణాలను పొందేలా సహాయపడుతామని చెప్పారు. ప్రస్తుతం వ్యక్తిగత, వ్యాపార, మార్టిగేజ్, గృహ రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రయివేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రూ.1200 కోట్ల డిస్పర్శ్మెంట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్ధలో 300కు పైగా సిబ్బంది పనిచేస్తున్నారనీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ సంఖ్యను వెయ్యి మందికి పెంచి రూ.2,500 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామని తెలిపారు.