Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
- కోకాపేట్లో యాదవ సంఘం భవన నిర్మాణ పనుల పరిశీలన
నవతెలంగాణ-గండిపేట్
రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో నూతనంగా నిర్మిస్తున్న కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజేస్తామని పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ˜ి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్లో నిర్మిస్తున్న కురుమ, యాదవ సంఘం భవన నిర్మాణ పనులను శనివారం మంత్రి పరిశీలించారు. అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాదవ సంఘం భవన నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 41 కుల సంఘాల భవనాలను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గొల్లకుర్మల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్టు తెలిపారు. కుల సంఘం భవనం కోసం ఐదెకరాల భూమి, రూ.ఐదు కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. పనులను త్వరలోనే పూర్తి చేసి, ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. యాదవులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఫెడరేషన్ చెర్మెన్ దూదిమేట్ల బాల్రాజుయాదవ్, రావులు శ్రీధర్‌రెడ్డి, సుందర్రాజు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు నోముల భగత్, జైపాల్‌యాదవ్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, కలెక్టర్ అమోరుకుమార్, సీఈ అనిల్‌కుమార్, యాదవ సంఘం నాయకులు చింతల రవీందర్‌యాదవ్, నార్సింగి వైస్ చైర్మెన్ వెంకటేష్‌యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ మేకల ప్రవీణ్‌యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్‌యాదవ్ పాల్గొన్నారు.