Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవ సలహాదారుగా ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి, గౌరవాధ్యక్షులుగా జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీ స్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మెట్టురవి, నారాయణ ఎన్నికయ్యారు. ఆ సంఘానికి గౌరవ సలహా దారులుగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, గౌరవాధ్యక్షులుగా జె.వెంకటేశ్ ఉండనున్నారు. శనివారం ఈ మేరకు జె.వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 33 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. కోశాధికారిగా సలార్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, అమీర్, చిరంజీవి, సహాయ కార్యదర్శులుగా మధు, మహేందర్, రాగుల రమేష్, జగదీష్లతో పాటు మరో నలుగురు ఆఫీస్ బేరర్లు, కో-ఆప్షన్ ఉండనున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా సతీష్, ఎడ్ల రమేష్, పెండ్యాల రవి, ఆకుతోట రాంచందర్, దేశిని రవి, శోభ, దాసరి యాకమ్మ, సతీష్, విజయలక్ష్మి, సమ్మయ్య, రామకృష్ణ, ఏడుగురు కో-ఆప్షన్ సభ్యులతో కలిపి మొత్తం 33 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.