Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేతన్న కళాకారుల ప్రతిభకు పుట్టినిల్లయిన సిరిసిల్లలో నేత కళాకారుడు నల్లా విజయ్ మరొక అద్భుతమైన కళను ఆవిష్కరించారు. ఇప్పటికే తన నేత ఉత్పత్తులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న విజయ్ ఈసారి సువాసనలు వెదజల్లే వెండి చీరలను మగ్గంపై నేశారు. నేత కళాకారుల ప్రతిభను వెన్నుతట్టి ప్రోత్సహించే మంత్రి తారక రామారావు చేతుల మీదుగా ఆ వెండి చీరలను ఆవిష్కరింపజేశారు. సుగంధ ద్రవ్యాలు, వెండితో తాను చీరను తయారు చేసినట్టు మంత్రి కేటీఆర్‌కు తెలిపిన విజయ్, దాదాపు నెలన్నర రోజులపాటు ఈ చీరపైనే పని చేసినట్టు చెప్పారు. ఇప్పటిదాకా విజయ్ నేసిన వస్త్ర ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.నేత కళాకారుడు విజయ్‌తో మాట్లాడిన మంత్రి కేటీఆర్, అతని కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. తెలంగాణ నేతన్నల అనితర సాధ్యమైన, అద్భుతమైన ప్రతిభకు విజయ్ నిదర్శనమని కొనిడాయారు. సిరిసిల్లకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అభిలాషించారు. విజయ్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు.