Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది డ్రాప్ట్ మాత్రమే.. మార్పులు, చేర్పులకు అవకాశం
- మాస్టర్‌ప్లాన్‌పై కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రెస్‌మీట్
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు ఉంటే జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు ఇవ్వొచ్చని.. ఆందోళనలు చేయొద్దని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. ఇది డ్రాఫ్ట్ మాత్రమేనని, మార్పులు చేర్పులకు అవకాశం ఉందని, ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ వివరాలను తెలియజేశామన్నారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ఫైనల్ కాలేదని సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అభ్యంతరాలను రైతులు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో తెలియజేయవచ్చని అన్నారు. రైతులు ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్‌లో మార్పులు, చేర్పులు చేసే వీలు ఉందన్నారు. ఇండిస్టియల్ ఏరియా డ్రాఫ్టు.. ఇది ప్రతిపాదన మాత్రమేనని, రైతులు అపోహలకు గురి కావద్దన్నారు. 2000లో పాత మాస్టర్ ప్లాన్ తయారు చేశారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఇండిస్టియల్ జోన్ ఏర్పాటు చేశారని, అక్కడ ఇంతవరకు ఎలాంటి పరిశ్రమలూ నెలకొల్పలేదని వివరించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రెస్మీట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొన్నారు.
హైకోర్టులో రైతుల రివ్యూ పిటిషన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండో వార్డ్‌కు సంబంధించిన పరపల్లి రైతులు మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ శనివారం హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. తమను సంప్రదించకుండా, కనీసం చర్చించకుండా, రిక్రియేషన్ జోన్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు రైతులు తెలిపారు. ఈ కేసు సోమవారం విచారణకు రానున్నట్టు రైతుల న్యాయవాది సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు.