Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కైరోస్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవాలు ఉల్లాసంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా మాజీ కలెక్టర్ ఎం.వి రెడ్డి, కైరోస్ చైర్మన్ ఎం.వెంకట్ రెడ్డి ఆదివారం వార్షికోత్సవాలను ప్రారంభించారు. పాఠశాల వార్షికోత్సవాల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నాగరికతలు, సంస్కతులు, ఆచార వ్యవహారాలు, జీవనశైలిపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు 'అరౌండ్ ద వరల్డ్ ఒడిస్సి' పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని వివిధ తరగతుల విద్యార్థులు ఆయా దేశాల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి, ఆకట్టుకునే థియేటరికల్ ప్రదర్శన చేశారు. అమెరికా, టర్కీ, చైనా, బ్రెజిల్, ఆఫ్రికా, స్పెయిన్, కొలంబియా, క్యూబాతో పాటు మొత్తం 20 దేశాలకు సంబంధించిన ఆచార, వ్యవహారాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కైరోస్ ఎండీ ఎం.సుమంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ కష్ణశ్రీ, అధ్యాపక బందం పాల్గొన్నారు.