Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మునుగోడు ఆర్టీసీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో మునుగోడు నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన మౌన పాదయాత్రకు టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) మద్దతు ప్రకటించింది. శనివారం ప్రారంభమైన ఈ పాదయాత్రలో తొలిరోజు సమాఖ్య నాయకులతో కలిసి ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్, ఖమ్మం, నల్గొండ రీజియన్ల నాయకులు గుండు మాధవరావు, సిరిపురపు సీతారామయ్య, గుగ్గిళ్ల రోశయ్య, కేవీ రామారావు, డీ శంకర్, బీ నాగేశ్వరరావు, పడిగ సీతారాములు, కందుల నర్సింహా, పగిళ్ల కృష్ణ, నందీశ్వర్, కరుణాకర్‌రెడ్డి, శ్యామ్, గుండు రమేష్, రాములు, కేవీ రెడ్డి, పరశురాములు, నల్గొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాషా తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు(ఆదివారం) కొత్తగూడెంలో ప్రారంభమైన పాదయాత్రలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కే గీత, ప్రకాశ్, హైదరాబాద్, నల్గొండ రీజియన్ల నాయకులు చారి, శ్రీనివాస్, పాపయ్య, వెంకటేశ్, ఎన్ఎన్ రావు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు నర్సిరెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రెండోరోజు పాదయాత్ర హయత్‌నగర్ డిపో వరకు జరిగింది. సోమవారం అక్కడి నుంచి ప్రారంభమై హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ సందర్భంగా హయత్‌నగర్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ పాల్గొని, సంఘీభావం తెలిపారు. సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి, సలహాదారులు కత్తుల యాదయ్య, సర్కంటి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.