Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18-22 వరకు 17వ జాతీయ మహాసభలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ యూనియన్ 17వ జాతీయ మహాసభలు ఈ నెల 18-22 వరకు బెంగుళూరులో జరుగనున్నాయనీ, వాటి పురస్కరించుకుని ఈ నెల పదోతేదీన అరుణపతాకాలు ఎగురవేయనున్నట్టు సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ప్రకటించారు. ఆ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికలోకానికి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సీఐటీయూ అనుబంధ సంఘాలన్నీ పదోతేదీన జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ''దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకుందాం. కార్మిక-కర్షక మైత్రి కొనసాగిస్తాం. మోడీ సర్కారు ఎనిమిదేండ్లుగా అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలను ముమ్మరం చేస్తాం. దేశాన్ని కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను, కార్మికులను చీల్చుతున్న ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతాం.దేశంలో శాంతిని నెలకొల్పేందుకు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ముందుకు సాగుతాం'' అని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.