Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుస్మృతి అమలుకోసం ఎత్తుగడలు
- ప్రజల మధ్య విద్వేషాలతో రాజకీయ లబ్ది
- సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టిస్తున్న వైనం
- ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన ఆవశ్యకత కమ్యూనిస్టుపై ఉంది :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి దేశాన్ని పురోగమనం వైపు నడిపే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దేశంలోని సమస్యలను గాలికొదిలేసి ప్రజల మధ్య విద్వేషాలను, మత ఘర్షణలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నదన్నారు. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలనే ఎత్తుగడతో ముందుకు సాగుతున్న తీరును వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లో నవతెలంగాణ ఆఫీసులో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. దీన్ని ప్రజాస్వామిక వాదులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మేలు జరిగే సమసమాజం రావాలని కమ్యూనిస్టులు పోరాడుతుంటే..బీజేపీ మాత్రం ప్రజలను కుల, మత విభేదాలతో చీల్చి దేశాన్ని తిరోగమనం వైపు నడిపే చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేయడం కోసం పనిచేస్తున్న తీరును వివరించారు. గతంలోనే భారత రాజ్యాంగం చెత్త అని గోల్వాల్కర్ అనగా, మనుస్మృతి ఉండగా రాజ్యాంగం గురించి చర్చే అవసరం లేదని జనసంఫ్‌ు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు వారే రాజ్యాంగంపై కపట ప్రేమను చూపుతున్నారన్నారు. రోజువారీగా ప్రజలు చేసే ప్రతిపనిలోనూ, రాజకీయాల్లోనూ విద్వేషాలతో తన భావజాలాన్ని ఎక్కిస్తున్న తీరును నిలదీశారు. చివరకు చిన్నపిల్లల మెదళ్లల్లోనూ విషభావజాలాన్ని ఎక్కిస్తున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై నేరుగా కాకుండా ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ మోడీ సర్కారు ముందుకెళ్తున్నదని విమర్శించారు. పార్లమెంట్లో అసమర్ధ పాలన అంటేనే తట్టుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉందన్నారు. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కారు హరిస్తున్నదని చెప్పారు. దేశంలో లౌకిక విలువలు, ఆర్థిక స్వాలంబన, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థలపై దాడి తీవ్రమైందనీ, వాటిని కాపా డుకోవా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. కట్టడి చేయకపోతే దేశంలో ప్రశ్నించే గళాలలను మరింత అణచివేసే అవకాశముంటుందని హెచ్చరిం చారు. ప్రజ లకు చైతన్యం కల్పించాల్సిన బాధ్యత అందరి కంటే ఎక్కువ గా కమ్యూనిస్టులపైనే ఉందని నొక్కి చెప్పారు. దేశాన్ని రక్షించుకునేందుకు బీజేపీని పాతరేయాలన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ విధా నాలు అమలు చేయాల్సిన అవసర ముందనీ, ఆ దిశగా కేరళ ప్రభుత్వం ముందుకు సాగుతున్న దని తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీప ీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు, నవ తెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, బుకహేౌజ్ ఎడిటర్ కె.ఆనందాచారి, పాల్గొన్నారు.