Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ర్యాలీలో మాణిక్ సర్కార్ పిలుపు
అగర్తలా : త్రిపుర రక్షణ కోసం రాజకీయ పోరాటానికి కార్మికులంతా సిద్ధం కావాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బిజెపిని గద్దెదింపాలని అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యాన అగర్తలాలోని స్వామి వివేకానంద గ్రౌండ్లో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగడం తక్షణ అవసరమని అన్నారు. తప్పుడు వాగ్దానాలు, భారీగా డబ్బు కుమ్మరించడం, భద్రతా బలగాల మోహరింపు తదితరాలతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అంతకుముందు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితిన్ చౌదరి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి మాణిక్ దేవ్, శంకర్ ప్రసాద్ దత్తా, పాంచాలి భట్టాచార్య తదితరులు ప్రసంగించారు.