Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ దాఖలైంది. ప్రభుత్వ వైఖరిని నిమిత్తం విచారణ ఈ నెల 11వ తేదీన జరుపుతామని జస్టిస్ పి.మాధవీదేవి చెప్పారు. అదే జిల్లాలోని రామేశ్వరపల్లికి చెందిన శ్రీనివాస్‌సింగ్ ఇతర రైతులు దాఖలు చేసిన రిట్లో తమ 250 ఎకరాలను రిక్రియేషన్ జోన్‌గా చూపడం అన్యాయమని పేర్కొన్నారు. పక్కనే రాజకీయ నేతల భూములు ఉన్నా వాటి జోలికి వెళ్లలేదన్నారు. తమకు తెలియజేయకుండానే కామారెడ్డి మున్సిపాలిటీ తమ భూములు రిక్రియేషన్ జోన్లో ఉన్నట్లుగా తీర్మానం చేసిందన్నారు. మున్సిపాలిటీలో తమ గ్రామం 2019లో విలీనం చేశారనీ, 2022 లో మున్సిపాలిటీ తీర్మానం చేసిందని గత నవంబర్‌లో మాస్టర్ ప్లాన్‌ను పేపర్లల్లో పబ్లిష్ చేశారని తెలిపారు. ఇదే తరహా రిట్ వేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. వ్యక్తిగత హౌదాలో వాదించేందకు అనుమతి కోరారు. వాదనలు 11న జరుగనున్నాయి.