Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణా నదిపైఐకానిక్ వంతెన నిర్మిస్తే సెల్ఫీలకు మాత్రమే పనికొస్తుందనీ, బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు మరోసారి అన్యాయం చేయకూడదని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మెన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. కృష్ణా నదిపై వంతెన నిర్మించాలనే డిమాండ్‌తో ఈనెల ఈ నెల 28న చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. కృష్ణానదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖకు కేఆర్ఎంబీ కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సబబని బైరెడ్డి ప్రశ్నించారు. దాన్ని కర్నూల్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో చేరాలంటూ హైదరాబాద్‌లో వ్యాపారులను ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. అలాంటి వారే అందులో చేరి కండువా కప్పుకుంటున్నారని వివరించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కూడా అలానే చేరినట్టున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీని బాగుచేస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారనీ, తెలంగాణలో పరిస్థితి ఏమైనా బాగుందా ? అని బైరెడ్డి ప్రశ్నించారు.