Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముత్తూట్ ఫైనాన్స్‌కు అనుబంధ సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ సబ్సిడరీ ముత్తూట్ హోమ్‌ఫిన్ (ఇండియా) లిమిటెడ్ (ఎంహెచ్ఐఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా అలోక్ అగర్వాల్‌ను ఆ సంస్థ నియమించింది. ఈ నియామకంతో, ముత్తూట్ హోమ్ ఫిన్ తమ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటుగా, దిగువ మధ్య తరగతి (ఎల్ఎంఐ) కుటుంబాలకు గృహ రుణాలను అందజేయడంతో పాటుగా ఆర్ధిక సమ్మిళితకు తోడ్పడుతుందని ఆ సంస్థ తెలిపింది. కోవిడ్ ఉధృతి తగ్గడంతో గృహ ఋణ విభాగంలో చక్కటి వేగం కనిపిస్తున్నదనీ, దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముత్తూట్ హౌమ్ ఫిన్ ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ చక్కటి డిమాండ్ కనబరుస్తున్నదని తెలిపింది.