Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పీల్ బెటర్ వరల్డ్ ట్రాష్టూ ట్రెజర్ కార్యక్రమంతో ముందుకు
- ఐటీసీ ఫుడ్స్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కవిత చతుర్వేది
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇప్పీల్ బెటర్ వరల్డ్ ట్రాష్ టూ ట్రెజర్ కార్యక్రమంలో భాగంగా 18 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసి వెయ్యి బెంచీలను తయారు చేయిస్తున్నామనీ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఇండియాలోని వందకుపైగా నగరాల్లో 35 లక్షల మంది చిన్నారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఐటీసీ ఫుడ్స్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కవిత చతుర్వేది తెలిపారు. ఇప్పటికే బెంగుళూరులోని పలు ప్రభుత్వ పాఠశాలకు 80 బెంచీలను అందజేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పర్యావరణంపై దాని ప్రభావం, కనీస స్థాయికి తీసుకొచ్చే వ్యూహాలు, పునర్వివినియోగం, రీసైకిల్ చేయడం వంటివాటిపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విషయంలో చిన్నారులను చైతన్యపరుస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా వినియోగించాలనే దానిపైనా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో తాము తయారు చేసిన బెంచీలను మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.