Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి ఎర్రబెల్లికి ఉద్యోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని సెర్ప్ ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మినిష్టర్స్ క్వార్టర్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సెర్ప్ ఉద్యోగ సంఘాల క్యాలెండర్‌ను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు కుంట గంగాధర్‌రెడ్డి, సుదర్శన్, జానయ్య, సుభాష్, వెంకట్ మంత్రి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. సెర్ప్ ఉద్యోగులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ ఫైల్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసిందుకు ధన్యవాదాలు తెలిపారు. జీవోను కూడా తొందరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. 23 ఏండ్లుగా నామమాత్రపు ఉద్యోగ భద్రతతో, చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించడం, బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం, తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రికి సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ..సెర్ప్ ఉద్యోగుల పేస్కేలు జీఓకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, అదేవిధంగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగ సంఘాల జిల్లాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.