Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ- హయత్‌నగర్
ఆర్టీసీ సంస్థను కాపాడుకో వాలంటే అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కార్మికుల పోరాటానికి మద్దతుగా నిలవా లని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. చౌటుప్పల్ నుంచి ధర్నాచౌక్ వరకు మూడ్రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన పాదయాత్ర సోమవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపో వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాల్గొని కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ ఇవ్వాలని, సంస్థలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్కు ఎన్నికల్లో కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చినా.. ప్రజాసమస్యలపై పోరాడటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి బాలరాజు, ఉపాధ్యాక్షుడు చంద్రయ్య, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జిఆర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవి.రావు, చంద్ర ప్రకాశ్, అచ్చాలు, రవీందర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.