Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యు) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవితం ప్రజాఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నదని ఎంసీపీఐ(యు) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ తెలిపారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి శతజయంతి వార్షికోత్సవాలు సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందర విజ్ఞాన కేంద్రంలో ''తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తి రాజకీయ సామాజిక అంశాలపై బీయన్ ప్రభావం''అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో మడమ తిప్పని నాయకుడిగా పోరాటం నిర్వహించారని గుర్తుచేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుకుపల్లి సీతారాములు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన మహాత్తర పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఆయన్ని స్మరించుకోవడమంటే కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ప్రజా పోరాటాలను స్మరించుకోవడమేనని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యోధులు కందిమల్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, బీఎన్ జీవితాన్ని వేరుగా చూడలేమని తెలిపారు. ప్రజాకవి జయరాజ్ మాట్లాడుతూ అందరికీ ఉద్యమాల దివిటీ బీఎన్ అని తెలిపారు.ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఉపేందర్ రెడ్డి, జస్టిస్ (రిటైర్డ్)చంద్ర కుమార్, బిఎల్ఎఫ్ చైర్మెన్ నల్ల సూర్యప్రకాష్, ఎస్‌యుసీఐ(ఎస్) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవర్ధన్, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు, అరుణోదయ సంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల కన్వీనర్ విమలక్క, ప్రజా గాయకులునరసన్న, కొత్తగట్టు మల్లయ్య, సుందరి జగన్, సీపీిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా తదితరులు ప్రసంగించారు. ఎంసీపీఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.