Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, వివిధ డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) రాతపరీక్ష మే 17న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్ సి శ్రీనాథ్ మంగళవారం నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి తుదిగడువు ఏప్రిల్ 24వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.100తో అదేనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు గడువుందని తెలిపారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు. అభ్యర్థులు వివరాల కోసం polycet.sbtet.telangana.gov.in వెబ్సైట్ను, 040-23222192 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.