Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పదేళ్ల నుంచి మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ రంగంలో రాణిస్తున్న లాట్ మొబైల్స్ సంక్రాంతి పండగ సందర్బంగా పలు ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. అన్ని బ్రాండెడ్ మొబైళ్లు, స్మార్ట్ టివిలు, లాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, హోంథియేటర్, నూతన యక్సేసరీస్ పైనా ఆకర్షణీయ డిస్కౌంట్లను ఇస్తున్నామని లాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం అఖిల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరేటోస్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్పార్క్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ లభిస్తాయన్నారు. 32 అంగుళాల టివికి ధర చెల్లించి.. 40 అంగుళాల టివిని తీసుకెళ్లవచ్చని వెల్లడించారు. తమ వద్ద అతి తక్కువ ధర రూ.8,999కే స్మార్ట్ టివి, రూ.16,500కే ల్యాప్టప్లు లభిస్తాయన్నారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చన్నారు.