Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెరా వైబ్సైట్లో తనిఖీ చేసుకోవాలి :టీఎస్ రెరా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ రిజిస్టర్డ్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, షాపులను కొనుగోలు చేయవద్దని టీఎస్ రెరా హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం టీఎస్ రెరా చైర్మెన్ సోమేశ్ కుమార్ ఒక ప్రటన విడుదల చేశారు. కొనుగోలు చేసే ముందు ఒక సారిరెరా వెబ్ సైట్ https;//rerait.telangana.gov.in/SearchList/Searchలో తనిఖీ చేసుకోవాలని సూచించారు. స్క్వైర్ యార్డ్ ఫ్యాక్టరీ పేరుతో చేవెళ్ల వద్ద గోల్డెన్ పామ్స్ ఎన్ క్లేవ్ (12 ఎకరాలు), కిస్టాపూర్ వద్ద గ్రీన్ స్క్వైర్, ప్రైమ్ ఎవెన్యూ (10.5 ఎకరాలు), రాకంచర్ల వద్ద మ్యాజెస్టిక్ విల్లాస్ (11.5 ఎకరాలు), రాకంచర్ల వద్ద స్టార్ కాలనీ (3.5 ఎకరాల)కు ఎకరాల్లో పెట్టుబడి పెట్టండి... స్క్వైర్ యార్డ్స్‌లో లాభం పొందడి అంటూ ఆ సంస్థ ఫోన్ నెంబర్లు, వెబ్‌సైట్‌తో ప్రచారం చేసుకుంటుందని తెలిపారు.