Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొర్రెల పంపిణీ పథకం అమలుపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం అమలు తీరు అధ్యయం చేసేందుకు ఉత్తరాఖండ్ బృందం రాష్ట్రానికి చేరుకుంది. మంగళవారం హైదరాబాద్‌లోని షీప్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో చైర్మెన్ దూదిమెట్ల బాలరాజ్‌తో బృందం సమావేశమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు, గొర్రెలు, ఉన్ని అభివృద్ధి బోర్డు జేడీ డాక్టర్ నీత్వాల్ ఆర్ఎస్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అశోక్ బిస్త్, డిప్యూటీ మేనేజర్ సంజరు సక్సేనా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు తీరును బాలరాజు వివరించారు. ఆ పథకం పనితీరు, తద్వారా పొందుకున్న లబ్ధిదారుల కుటుంబాల ఆదాయ స్థితిగతులను తెలిపారు. రెండో విడతలో మరో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ జరుగుంతందని తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఎమ్డీ డాక్టర్ యస్.రామచందర్, ఏడీ డాక్టర్లు సత్యనారాయణ, వెంకటయ్య గౌడ్, డాక్టర్ సాయిరాజ్, డాక్టర్ మనోజ్, ఎంకే రాజు,క్రిష్ణ తదితరులు ఉన్నారు.