Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 నెలల్లో 100 మి.టన్నులు లోడింగ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద మిలియన్ టన్నులకు పైగా సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. కేవలం 9 నెలల 9 రోజుల వ్యవధిలో ఈ రికార్డు సాధించినట్టు ఆ సంస్థ మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. జనవరి 9 నాటికి 100.236 మిలియన్ టన్నులను లోడ్ చేసినట్టు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 11.5 మిలియన్ టన్నులు అధికంగా సరకు రవాణా లోడింగ్ చేసి, రూ.9,755 కోట్ల ఆదాయం సాధించామన్నారు. గత ఏడాదికంటే తక్కువ టైంలో 24 శాతం పైగా అధిక ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 50.35 మిలియన్ టన్నుల (మి.ట) బొగ్గు (17.7శాతం), 26 మి.ట. సిమెంట్ (5శాతం), 5 మి.ట. ఎరువులు (23శాతం), 18.76 మి.ట. ఇతర సరకులు (11శాతం) పై కాలంలో రవాణా జరిగాయన్నారు. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆపరేషన్స్ అండ్ కమర్షియల్ విభాగం బృందాన్ని అభినందించారు.