Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ కేడర్‌కు సంబంధించి రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు రాష్ట్ర ఐపీఎస్ వర్గాలలో కలకలం రేపింది. రాష్ట్రంలో అత్యున్నత పదవి అయిన చీఫ్ సెక్రటరీ హౌదాలో ఉన్న సోమేష్‌కుమార్‌కు తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తు కేంద్ర పరిపాలనా ట్రలిబ్యునల్ ఇచ్చిన తీర్పును రద్దు చేయడమే గాక ఆయనను ఏపీ కేడర్‌కు కేటాయిస్తు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఇంకా ఎంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పడనుందో నన్న వాడి వేడి చర్చ పోలీసు ఉన్నతాధికార వర్గాలలో సాగుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కేటాయింపులు రెండు రాష్ట్రాలకు జరిగాయి. అయితే ఆ సమయంలో ఏపీ కేడర్‌కు తాఉము కేటాయించబడినప్పటికి కొందరు ఐపీఎస్ అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లకుండా ఇక్కడే కీలకమైన పోస్టులలో కొనసాగుతున్నారు. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సదరు అధికారులకు సంబంధించి సర్ధుబాటు ధోరణితోటే వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. కాగా తాజాగా సోమేష్‌కుమార్ కేడర్‌కు సంబంధించి కేంద్ర డీఓపీటీ విభాగం 1917లో వేసిన పిటీషన్‌పై తాజాగా హైకోర్టు తీర్పు నివ్వడంతో ఐఏఎస్, ఐపీఎస్ వర్గాలలో అంతర్గతంగా ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇలటీవలనే రాష్ట్ర డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ఇంకా తెలంగాణ కేడర్‌కు కేటాయించబడలేదని తెలుస్తోంది. తాజా పరిణమాల దృషట్య రాష్ట్ర పోలీసు బాస్‌కు సైతం కేడర్ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతున్నది. సోమేష్‌కుమార్ విసయంలో కేంద్ర భ్రుత్వానికి చెందిన డీఓపీటీ విభాగం జోక్యం చేసుకున్న కారణంగా ఆయనకు సమస్య తలెత్తిందని అదే సమయంలో అంజనీకుమార్ విసయంలో ఈ పరిస్థితి తలెత్త బోదని కొందరు పోలీసు ఉన్నతాధికారులు వాదిస్తున్నారు. అదే సమయంలో మరో ఇద్దరు అదనపు డీజీ స్థాయి అధికారుల విషయంలోను కేడర్ సమస్య ఇంకా తొలగి పోలేదు. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, కేంద్రంలో డిప్యూటేనషన్పై ఉన్న సంతోష్ మెహ్రాల కేడర్ ఏపీగానే కొనసాగుతున్నట్టు తెలిసింది.